Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పింక్ డైమండ్ .. మాళవిక మోహనన్.. లేటెస్ట్ పిక్స్

Malavika Mohanan Special
Advertisement
  • మలయాళ మూవీతో ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్
  • తమిళంలోను మంచి క్రేజ్ 
  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే భామ 
  • 'రాజా డీలక్స్' ప్రభాస్ జోడీకట్టే ఛాన్స్ 

Advertisement
ఒకప్పుడు తెలుగు తెరపై బాలీవుడ్ భామల జోరు కొనసాగుతూ వచ్చింది. ఆ తరువాత మాత్రం మలయాళ బ్యూటీల సందడి పెరుగుతూ వెళ్లింది. మలయాళ ముద్దుగుమ్మలు ఒకరి తరువాత ఒకరుగా ఇక్కడ చక్రం తిప్పుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే మరో మలయాళ మందారం తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆ సుందరి పేరే మాళవిక మోహనన్. కేరళలో పుట్టిపెరిగిన మాళవిక మొహనన్ మలయాళ సినిమా ద్వారా 2013లోనే ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి మలయాళ .. తమిళ సినిమాలను చేసుకుంటూ వెళుతోంది. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకునే మాళవిక మోహనన్ మోడల్ గాను బాగానే సంపాదిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్ల చూపులన్నీ తనవైపుకు తిప్పుకుంటూ ఉంటుంది. అలాంటి మాళవిక మోహనన్ నుంచి లేటెస్ట్ పిక్స్ ను వదిలారు. పింక్ కలర్ శారీలో పింక్ డైమండ్ లా ఆమె మెరిసిపోతోంది. చురుకైన చూపులతో కుర్రాళ్ల మనసులను ఖాళీ చేసేస్తోంది. 'రాజా డీలక్స్' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయం కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ జోడీ కట్టే ముగ్గురు భామల్లో ఆమె ఒకరుగా కనిపించనుందని అంటున్నారు. అదే నిజమవుతుందేమో చూడాలి మరి.
Advertisement
Advertisement
Malavika Mohanan
Actress
Raja Deluxe Movie

More Telugu News